Skip to main content

Telugu News Power

వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్‌కు రజతం. పర్సనల్ బెస్ట్ ప్రదర్శనతో మెరిసిన భారత అథ్లెట్!

పథకం అందుకున్న అథ్లెట్ కౌర్

గ్లాస్గో: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)
కామన్‌వెల్త్ గేమ్స్ 2026 వేదికగా భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన భారత స్టార్ అథ్లెట్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకున్నారు.
​పోటీలో భాగంగా హర్జిందర్ కౌర్ స్నాచ్ విభాగంలో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 126 కేజీలు ఎత్తి.. మొత్తం 227 కేజీల భారంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె, ఈసారి పతకం రంగును మార్చి రజతం సాధించడం పట్ల క్రీడాభిమానులు, ప్రముఖులు హర్జిందర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.