Skip to main content

Telugu News Power

అమరావతి క్రీడా సంరంభం ప్రారంభం.

క్రీడా ప్రారంభోత్సవంలో డివైఇవో మురళి

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక అమరావతి క్రీడోత్సవాలు బుధవారం స్థానిక బి.ఆర్.ఎం.వి ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 120 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో కోరుకుంటున్నారు. యోగ, చెస్, ఇండోర్ గేమ్స్ తో పాటు, కోకో, కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నారు. అండర్ 17 నుంచి అండర్ 23 వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ లో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడోత్సవాలు, డి వై ఈ ఓ మురళి సత్యనారాయణ ప్రారంభించారు. నెల అభివృద్ధి అధికారి ఎన్ ఉమామహేశ్వరరావు, ఎం ఈ ఓ లు గంగాధర్ శర్మ, గుమ్మల్ల వీరాస్వామి, దేవరపు పద్మాజీరావు, హెచ్ఎం శశి లీల, వ్యాయామ ఉపాధ్యాయులు రవిబాబు, రేలంగి రామకృష్ణ, ఉపాధ్యాయులు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.