Skip to main content

Telugu News Power

దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర!

తిరంగా ర్యాలీలో కేంద్రమంత్రి వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు

కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.

భీమవరం: ఆగస్టు, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్)హర్ ఘర్ తిరంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ‘తిరంగా యాత్ర’ను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.మార్గమధ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఎస్సార్ నగర్‌లోని స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, యువతలో ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తిని నింపడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.