పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ
మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్, మంగళగిరి వారి ఆదేశాల మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా–2026 కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి 100 మీటర్ల జాతీయ పతాకంతో కళాశాల నుంచి ఎడ్ల బజార్ సెంటర్ మీదుగా పాలకొల్లు పరిసర ప్రాంతాలలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు “జై హింద్”, “హర్ ఘర్ తిరంగా”, “సారే జహాసే అచ్చా, హిందుస్తాన్ హమారా”, “త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం”, “మన జెండా – మన గర్వం” వంటి దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పాదుకొల్పపారు.కళాశాల ప్రాంగణంలోని నోటీసు బోర్డులపై జాతీయ భావాన్ని ప్రతిబింబించే నినాదాలు, ప్లకార్డులను ప్రదర్శించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, జాతీయ జెండా దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశభక్తి భావాన్ని చాటాలని, యువతలో జాతీయ ఐక్యత, దేశ సేవ పట్ల బాధ్యతను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీ. కృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ జి. సుమలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం. రామకృష్ణ, డాక్టర్ వి.డి.వి. విజయలక్ష్మి, ఇంగ్లీష్ విభాగాధిపతి కె. శామ్యూల్, అధ్యాపకులు జి.డి. శ్రీనివాస్, ఏ. వంశీ, కె. శివకృష్ణ, బి. రామలక్ష్మి, సిహెచ్ రవి కుమార్, వి. శిరీష, జె. చలం ప్రసాద్, కె. పార్థసారథి, కె. స్వర్ణలత, బి. ఆశాజ్యోతి, కె. రోహిత్, పి. జోష్ణ శ్రీ , ఏం దివ్య, ఎం శిరీష,అధ్యాపకులు, సిబ్బంది,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
అద్దేపల్లి కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా వేడుక.
హర్ ఘర్ తిరంగా దేశభక్త యాత్ర.