పాలకొల్లు:ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం, హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి పూలపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం వరకు సాగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో దేశభక్తి ప్రబోధిత నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మండల స్థాయి అధికారులు ఉమామహేశ్వర రావు, పద్మాజీ రావు, గుమ్మళ్ల వీరస్వామి, మూర్తి, మంతెన నారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శులు,ఇతర గ్రామస్థాయి అధికారులు, పురప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మండల పరిషత్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ.