Skip to main content

Telugu News Power

హర్ ఘర్ తిరంగా, ఘనంగా యలమంచిలి లో ర్యాలీ.

తిరంగా జండా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ ధనలక్ష్మి తదితరులు

యలమంచిలి: ఆగస్టు, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని, మండల పరిషత్ అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా జండా పండుగ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఇ) జె డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 100 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని, సుమారు 300 మంది గ్రామంలో ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన, దేశభక్తిని నాదాలు, అమరవీరుల త్యాగల గురించి నినాదాలు ఇచ్చారు. స్థానిక కాళ్లూరి నారాయణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రారంభమైన ఈ తెలంగాణ ర్యాలీ గ్రామ సచివాలయం, స్టేట్ బ్యాంక్, గ్రామ సెంటర్ నుంచి సాగింది. ఈ ర్యాలీలో తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్, ప్రత్యేక అధికారి కాసా వెంకటరమణ,ఎంఈఓ ఎం వి సత్యనారాయణ, రావూరి వెంకట మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు సురేష్, అంగన్వాడీ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, విద్యార్థులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.