Skip to main content

Telugu News Power

కలెక్టరేట్లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే అంజిబాబు,కలెక్టర్ నాగరాణి.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి
జాతీయ పతాకకు అభివందనం చేస్తున్న మంత్రి నిమ్మల.

భీమవరం:ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో, 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) లతో కలిసి జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్–2047’ లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, మన జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. స్వాతంత్ర్య సమరంలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తు, పచ్చని పల్లెల ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి రాష్ట్రాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాను ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. అనంతరం వివిధ శాఖలలో వృత్తిపట్ల ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఏపిఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.