
యలమంచిలి:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలల విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక ఏనుగువానిలంక శ్రీ పాత్తూరి రామలింగ రాజు ( కాశి రాజు) మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం దేవి ఫిషరీస్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) నిధుల నుంచి 244 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవి ఫిషరీస్ యాజమాన్యానికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దేవి ఫిషరీస్ ఎండి సురేందర్ ను విశేషంగా హాజరైన స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ, తనకున్నన్ని అవకాశాలను నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసంమే ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు దూరభారం కలగకుండా, ఉచిత సైకిళ్ళు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సైకోలు కూడా అత్యంత నాణ్యమైన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత సైకిళ్ళు గా భావించి, ఫోను చేసుకోవద్దని ఎప్పటికప్పుడు సైకిల్ నిర్వహణ, ఆయిలింగిం చేసుకోవాలని కోరారు. లేదంటే తానే స్వయంగా వచ్చి ఆ సైకిల్ శుభ్రం చేస్తానని సూచించారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఈ ఉచిత సైకిళ్ల పంపిణీపై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు మంత్రికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, నర్సాపురం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పాత్తూరి రామాంజనేయ రాజు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, జనసేన మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, టిడిపి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బొప్పన హరి కిషోర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పీతల శ్రీనివాస్, రావూరి అప్పారావు, మాజీ జడ్పీటీసీ బోనం నాని, సర్పంచుల చాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపి, మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి, ఉపాధ్యాయులు,విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
