Skip to main content

Telugu News Power

కొత్తగా రెక్కలొచ్చిన భోగాపురానికి వైభోగం, ఎగరేసుకుపోయిన వేలకోట్ల ఆదాయం విశాఖకు, వీడ్కోలు,విశ్రాంతి, విమానాశ్రయంలో ఆవేదనతో ఎమ్మెల్యే గంటా, మిత్రబృందం భావోద్వేగం.

విశాఖపట్నం:ఆగస్టు,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం నుంచి సోమవారం అధికారికంగా, విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఈనెల 1న భారీ ఏర్పాట్లతో లాంచనంగా ప్రారంభించారు. వాణిజ్య కార్యక్రమాలు, 17 నుంచి అందుబాటులోకి వస్తాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై తర్వాత, అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్రతీర నగరం విశాఖపట్నం. ఇక్కడ 1941లో సైనిక అవసరాల కోసం విమానాశ్రయం ఏర్పాటు అయింది. దేశపౌరుల కోసం 1954 లో ద్వారాలు తెరిచింది. అక్కడ నుంచి 2010 లో అంతర్జాతీయ స్థాయి కి ఎదిగింది. ఈ ప్రాంత అవసరాల దృష్ట్యా అత్యంత ఆధునిక, సువిశాల విమానాశ్రయ నిర్మాణం అనివార్యం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో నూతన విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తదుపరి దీనిపై జగనన్న రైతుల తరఫున అవసరమైతే కోర్టుకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో నిర్మాణం మొదలైంది. కూటమికి కలిసి వచ్చిన అవకాశంతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధతో విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. ఇందుకు అవసరమైన స్థల సేకరణ విజయనగరం అనువైనదిగా గుర్తించారు. భోగాపురంలో కొత్త విమానాశ్రయానికి బీజం పడింది. కేంద్ర విమానయాన శాఖ మాత్యులు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఉత్తరాంధ్రవాసి కావడంతో, పనులు సరవేగంతో పూర్తిచేసి, విమానాశ్రయ సేవలు అందుబాటులో తెచ్చారు. తూర్పు తీరనావికాదళంతో అనుసంధానమైన ఈ విమానాశ్రయం రక్షణ పరంగా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్క విమాన సర్విస్ ప్రారంభమై రోజుకు 15 విమానాలు ఎగిరేస్తాయికి ఎదిగి, నేటితో ముగిసిన 5 దశాబ్దాల అనితర సాధ్యమైన విశాఖ విమానాశ్రయ సేవలు ఇక చరిత్ర పుటల్లో, జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. మళ్లీ మూలాలకు మళ్లడం అంటే, ప్రారంభంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ విమానాశ్రయం మళ్లీ సైన్యం అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా విధ్వంసం నుంచి అభివృద్ధి పుడుతుంది అన్న సిద్ధాంతం మరోసారి రుజువు అయింది. ఈ విమానాశ్రయం అర్థ శతాబ్దం పాటు ఓ మహా వృక్షమై ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇచ్చినట్టు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలకు, లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించింది. నగరానికి వచ్చే వేలకోట్ల ఆదాయం అదివారము అర్ధరాత్రి నుంచి విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు తన రెక్కల పై ఎగరేసుకుపోయింది. రవాణా, ఆతిధ్యరంగం, పర్యాటకం మొదలైన క్షేత్రాలపై ఈ తరలింపు ఆర్థిక మూలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని నమ్ముకుని బ్రతుకు వెళ్ళదీస్తున్న ఎన్నో కుటుంబాల ఆశలపై తరలింపు ప్రక్రియ శాశ్వతంగా నీళ్లు చల్లింది. నమ్ముకం వమ్మయి దిక్కు తోచని స్థితిలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించడం అనివార్యం అయ్యింది.
ఈ విమానాశ్రయాల ఆవిర్భావ రాకపోకల సందర్భంగా, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తమకు సేవలు అందించిన విమానాశ్రయం, శాశ్వతంగా దూరంగా కావడంతో మంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. కోట్లాదిమంది ప్రయాణికులను, కోట్ల టన్నుల కార్గో విమానాశ్రయం నుంచి తరలించిన విశేషాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. వ్యాపారవేత్తగా, ప్రజా ప్రతినిధి గా తన ప్రయాణం ఈ విమానాశ్రయము నుంచే ప్రారంభించినట్టు, తనకున్న అనుబంధాన్ని, అభిమానాన్ని వెల్లడించారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్న సామెత విశాఖపట్నం విమానాశ్రయానికి వర్తించదని, విశాఖపట్నం తో పెనం వేసుకున్న తమ అనుభవాలు ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయని పేర్కొన్నారు. ఈ బంధం తెగిపోవడం తనకెంతో బాధగా, వెలితిగా ఉందని విచారం వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం విమానాశ్రయంలో కలుసుకున్న సందర్భంగా, తమ ఆవేదన పంచుకున్నారు. బరువెక్కిన గుండెలతో విమాన ఆశ్రయానికి తుది వీడ్కోలు పలికారు.