
పాలకొల్లు:ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా, స్థానిక మానవత స్వచ్ఛంద సంస్థ శాంతి ర్యాలీ నిర్వహించింది. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి బుధవారం ప్రారంభమైంది. మానవతా స్వచ్ఛంద సంస్థ ఏటా ఆగస్టు నెలలో శాంతి ర్యాలీ నిర్వహిస్తుందని జిల్లా మానవతా శాంతి ర్యాలీ కన్వీనర్ డాక్టర్ ప్రతాపరాజు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నుంచి పౌరులను కాపాడడానికి ఈ శాంతియాత్ర చేస్తున్నట్టు తెలిపారు. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదాలను నివారించడానికి మొక్కలు నాటడం ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. మున్సిపల్ కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్ జండా ఊపి శాంతి ర్యాలీని ప్రారంభించారు. శాంతికి చిహ్నమైన శ్వేత బెలూన్లను ఎగురవేశారు. పట్టణ పురవీధుల గుండా ఎడ్లబజార్, ఫైర్ స్టేషన్ వరకు నినాదాలతో కొనసాగింది. ఈ కార్యక్రమం పట్టణ మానవత అధ్యక్షులు ముత్యాల రామారావు, కార్యదర్శి ఇంటి గోపాలరావు, కోశాధికారి దేవన్న రవి కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ రజిని కుమార్, ముత్యాల శ్రీనివాస్, దర్శి శ్రీనివాస్ గుప్తా, యర్రంశెట్టి వెంకటరత్నం, జక్కంపూడి కుమార్, గుడాల హరిబాబు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.