Skip to main content

Telugu News Power

మానవతాల దినోత్సవం రోజు పరిమళించిన మానవత్వం. బాలికకు సైకిల్ బహుకరణ.

వాకర్స్ క్లబ్ వారు బాలికకు సైకిల్ బహుకరిస్తున్న స్తున్న దృశ్యం

పాలకొల్లు: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాటి మనిషి అవసరానికి సాయం చేయడమే మానవత్వమని వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకరరావు పేర్కోన్నారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా, ఆచంట మండలం ఎం. పి. పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న, తల్లి తండ్రులు లేని బాలిక కంకిపాటి రత్న కుమారి కి సైకిల్ యొక్క అవసరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తెచ్చారు. క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు స్పందించి క్లబ్ తరపున రూ.7 వేలు విలువైన సైకిల్ ను సభ్యులతో కలిసి ఆ బాలికకు అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకన రామకృష్ణ,సభ్యులు నంబూరి గంగాపవన్, విటాకుల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.