Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనులకు లక్ష్యాలు నిర్దేశించిన మంత్రి నిమ్మల. టిడ్కో ఇళ్ళుకు వచ్చే నెల15 డెడ్ లైన్.

టిడ్కో ఇళ్ళ ప్రగతిని తెలుసుకుంటున్న మంత్రి నిర్మల
మంత్రి నిమ్మల సమీక్ష సమావేశం పాల్గొన్న అధికారులు

పాలకొల్లు: ఆగస్టు, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయటానికి సంబంధిత అధికారులకు మంత్రి లక్ష్యాలు నిర్దేశించారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పధకాల పనులను ద్విచక్ర వాహనంపై కూటమి నాయకులతో కలిసి పర్యటించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో విదంగా పనులకు సంబంధించి అధికారు లు సమగ్రంగా చర్చించారు. పనులు పూర్తి
కావటానికి షెడ్యూల్ ప్రకటించారు. ఈ పర్యటన, సమీక్ష సమావేశంలో నరసాపురం ఆర్టీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు, ఏఎంసి మాజీ చైర్మన్ ఉన్నమాట్ల కపర్ది, ఇంజనీరింగ్ అధికారులు రాజ్ కుమార్, తోట నారాయణ రావు, కూటమి నాయకులు బోనం చినబాబు, పొట్నూరి శ్రీనివాస్, జక్కంపూడి కుమార్, విన్నకోట గోపి, బిట్ట లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.