Skip to main content

Telugu News Power

రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా పాలకొల్లును నిలబెడతా. -మంత్రి నిమ్మల

దాసరి మహిళా కళాశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభిస్తున్న మంత్రి నిమ్మల
అద్దేపల్లి కళాశాల వద్ద విద్యార్థినిల విశ్రాంతి గది ప్రారంభించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ అభివృద్ధికి ఈ రెండేళ్లలో
రూ. 1100 కోట్ల నిధులు తెచ్చినట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టణంలో రూ. 7.35 కోట్ల పనులకు మంత్రి కూటమి నాయకులతో కలిసి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి లో తీర్చిదిద్దడానికి 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రాన్ని రూ. 1 కోటితో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి ప్రహరీ గోడ, సుందరీకరణ, రోడ్లు, కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పార్కు పూడిక పనులలో డంపింగ్ యార్డ్ మట్టి వాడకాన్ని తెలుసుకొని వెంటనే ఆ మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిపై అధికారులు కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తప్పు జరిగినట్టు తన దృష్టికి వస్తే వెంటనే తానే దాన్ని సరిచేస్తానని మంత్రి తెలిపారు. వైసిపి తమ ఐదేళ్ల పాలలో అభివృద్ధిని విధ్వంసం చేసి, ఇప్పుడు ఆసుపత్రి వద్ద డంపింగ్ యార్డ్ మట్టిని వేశారనే సాకుతో, తొలగించిన తరువాత కూడా విమర్శలు చేసే అర్హత గొడ్డలి పార్టీకి లేదని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కోసం వచ్చే అతిధి నాయకుడను తాను కాదని, నిరంతరం ప్రజల్లో ఉండి వారి రుణం తీర్చుకోవటానికి పనిచేస్తానని మంత్రి పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కూటమి గెలుపుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తన పర్యటనలో స్థానిక ఆదేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో నిర్మించిన విద్యార్థినుల విశ్రాంతి గదిని, ప్రహరీ గోడ, దాసరి నారాయణరావు మహిళా కళాశాలలో అదనపు తరగతి గదులను, టిడ్కో ఇళ్ల సముదాయం వారికి నిర్మించిన బస్ స్టేషన్, నర్సాపురం కాలవపై వంతెనలను మంత్రి ప్రారంభించారు. ఈ పర్యటనలో కమిషనర్, దొడ్డా కిరణ్ కుమార్, వైద్యాధికారిణి, యర్రా మాధురి, ఇంజనీరింగ్ అధికారులు విజయ్, వెంకట్ నారాయణ, నారాయణరావు, ప్రిన్సిపాల్ కట్టారత్నమాణిక్యం, టి కృష్ణ, సిరిగినీడి రంగారావు, పెచ్చెట్టి బాబు, ఉన్నమట్ల కపర్తి, వెంకటేశ్వరరావు, కర్నేని గౌరు నాయుడు, పొట్నూరి శ్రీనివాస్, పెనుమత్స రామ్ భద్రరాజు, రియా, తులా రామలింగేశ్వరరావు, మండాది అవినాష్, జక్కంపూడి కుమార్, వి గోపి, మల్లంపల్లి పకీర్ బాబు, జగ్గరోతు రాంబాబు, ధనాని సూర్య ప్రకాష్, చినమిల్లి గణపతి రావు, మండెల రాంప్రసాద్ బిదురుకోట శేఖర్, పీతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.