Skip to main content

Telugu News Power

గుడివాడ ఏరియా ఆసుపత్రికి రూ. 2.61కోట్ల తో సౌకర్యాలు. సి టి స్కాన్, సోలార్ పవర్ ఏర్పాటు.

గుడివాడ ఆస్పత్రి సౌకర్యాల కల్పన పై మాట్లాడుతున్న ఎంపీ బాలసౌరి

గుడివాడ:ఆగష్టు, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్, రూ.76.60 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు. సిటీ స్కాన్ సేవలు పేదలకు ఉచితంగా అందుబాటులోకి రావడంతో పాటు, సోలార్ సిస్టంతో ఆసుపత్రి విద్యుత్ ఖర్చు తగ్గనుంది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి
మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక వసతులు కల్పించామని, ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.