విశాఖపట్నం: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ రత్న నేషనల్ అవార్డ్స్ -2026 కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ చవాకులసూర్య నరేష్ బాబుకి భారతీయ రత్న అవార్డు ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు గారి చేతుల మీదగా అందజేసి, సత్కరిం చారు. ఈ క్రమంలో లీడర్ పత్రిక అధినేత రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి గారు, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, శంఖారావం కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు బొమ్మిడి సత్యనారాయణ , ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి బాల మోహన్ దాస్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్టిస్ట్ డైరెక్టర్ ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ బాబును పలువురు అభినందించారు.
చవాకుల ట్రస్ట్ కు అవార్డు. నరేష్ కు సత్కారం.
సురేష్ ను సత్కరిస్తున్న సినీ దర్శకులు రేలంగి