Skip to main content

Telugu News Power

పవన్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం. రోడ్ల విస్తరణకు రూ.840 కోట్లు విడుదల.

న్యూఢిల్లీ: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్)
కూటమి ప్రభుత్వానికి వరంగా
రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎన్ హెచ్-365 బీబీ రహదారి అభివృద్ధికి రూ.840.41 కోట్ల మంజూరు ద్వారా చెసింది. రహదారి 45.09 కి.మీ. మేర అభివృద్ధి జరగనుంది. పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాలకు రహదారి సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు ఈ నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.బుట్టాయిగూడెం-ఎల్ ఎన్ డి పేట, పట్టిసీమ-కొవ్వూరు రోడ్లను 2లేన్లుగా విస్తరించడానికి అనుమతించినట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.
ఈ రోడ్ల వల్ల ఈ ప్రాంతంలోని చెరకు, పొగాకు పంట ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించవచ్చు.
గోదావరి ఘాట్లకు, పోలవరం డ్యామ్ కు సులభంగా చేరుకోవచ్చు’ అని వివరించారు.