పాలకొల్లు: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్, జి కె ఆర్ చాంబర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు 7 మందికి ఐసిఐసిఐ బ్యాంకు, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆన్ లైన్ రాత, హెచ్ఆర్ రౌండ్స్ నందు సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్స్, ఐటి ఆపరేషన్స్ మేనేజర్స్ గా ఎంపికైనారని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు తెలిపారు. వీరిలో జి. సురేఖ, జి. మధులత, పి.యజి త, జి. వాసవి, పి. పవిత్ర దేవి ఐటీ ఆపరేషన్ మేనేజర్స్ గాను, పీ. కుషోర్ కుమార్, ఏ. వెంకట రాజేష్, సేల్స్ మరియు రిలేషన్షిప్ మేనేజర్స్ గాను, ఎంపికైనారు. ఎంపికైన విద్యార్థులు చాంబర్స్ కళాశాల లో డిగ్రీ పూర్తి చేసి వెంటనే ఈ ఉద్యోగాలకు ఎంపికైనారు.వీరిని కళాశాల యాజమాన్యం అభినందించినారు.
కళాశాల సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్, ఆర్ ప్రవీణ్ భాను, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు, కళాశాల అధ్యాపకులు ఎన్. రవికుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ యు జానకి రామయ్య , టి.మీనా తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.
బ్యాంకు ఉద్యోగాలకు ఛాంబర్స్ విద్యార్థులు ఎంపిక.
బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి సూచనలు ఇస్తున్న దృశ్యం