Skip to main content

Telugu News Power

ప్రముఖ సహజ నటుడు జి.వి. నారాయణరావు మృతి తెలుగు సినీ పరిశ్రమ నివాళులు !

తాళికట్టు శుభవేళ పాటకు నారాయణరావు నటన
ఒక ఊరి కథలో నారాయణరావు

హైదరాబాద్: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న జి.వి. నారాయణరావు (73) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, సన్నిహితులు ప్రేమగా జి.వి.ఆర్ అని పిలుచుకొనే జి.వి నారాయణరావు సుమారు 100కు పైగా చిత్రాలలో నటించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
నారాయణరావు, కృష్ణా జిల్లా, కురుమద్దాలి లో జన్మించారు. వారి తండ్రి జి.డి.ప్రసాదరావు సినిమా పంపిణీ రంగంలోను , సారథీ స్టుడియోకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉండేవారు. వారి బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లు, హైదరాబాదులలో జరిగింది. .
నారాయణరావు గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. ప్రముఖ సినిమా నటులు కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, విద్యాసాగర్, దేవదాస్ కనకాల మొదలైనవారు ఇతని రంగస్థల సహచరులు . మద్రాసు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 1973లో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్ రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయనకు బ్యాచ్ మేట్. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్‌లతో ఈయనకు అత్యంత ఆప్తమిత్రత్వం ఉంది. సినిమాలలో నటించడమే కాక కొన్ని చిత్రాలను నిర్మించారు.
సినీ ప్రస్థానం, పురస్కారాలు, పరిశీలిస్తే,1976లో ప్రముఖ దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన మొదటి సినిమా ‘అంతులేని కథ’ లోని ‘తాళికట్టు శుభవేళ’ పాటలో అద్భుత నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.ఆయన కథానాయకుడిగా నటించిన ‘ఒక ఊరి కథ’ చిత్రానికి గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. అయన నటించిన ప్రముఖ చిత్రాలు,ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది వంటి చిత్రాలలో హీరోగా, మంచు పల్లకి, ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, హిట్లర్, సీతారామయ్య గారి మనవరాలు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో సహాయ నటుడిగా మెప్పించారు. వెండితెరపైనే కాక పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు.జీవీ నారాయణరావు తన నటనలో సహజత్వానికి, వైవిధ్యానికి పెద్దపీట వేసిన నటుడు. నాటకరంగ నేపథ్యం, శాస్త్రీయ నృత్య పరిజ్ఞానం, ప్రసిద్ధ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ శిక్షణ ఆయన నటనను మరింత సున్నితంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దాయి. సుమారు 100కు పైగా చిత్రాలలో నటుడిగా ఆయన నటప్రయాణం సాగింది.
చదువుకునే రోజుల్లోనే ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’, ‘ప్రతాపరుద్రీయం’, ‘మంచుతెర’ వంటి ప్రసిద్ధ నాటకాలలో నటించి నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్ వంటి దిగ్గజాలు ఈయనకు రంగస్థల మిత్రులు. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవడం వల్ల ఆయన హావభావాలు (Expressions) ఎంతో స్పష్టంగా ఉండేవి.

తొలి చిత్రంలోనే ‘నంది’ అవార్డు గుర్తింపు : “అంతులేని కథ” (1976): కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చింది.
ముఖ్యంగా “తాళికట్టు శుభవేళ” అనే ప్రసిద్ధ పాటలో కేవలం తన కళ్ల ముఖ కవళికలతో, భావోద్వేగాలతో ఆయన పండించిన నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఈ చిత్రానికి గాను ఆయన తొలి ప్రయత్నంలోనే ‘ఉత్తమ సహాయ నటుడిగా’ నంది అవార్డు అందుకున్నారు.
సమాంతర సినిమాల్లో హీరోగా, ఒక ఊరి కథ (1977), మృణాళ్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ కళాత్మక చిత్రంలో హీరోగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను ఆయనకు ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. . కథానాయకుడిగా, ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘అంగడి బొమ్మ’ వంటి దాదాపు 40 చిత్రాలలో ప్రధాన హీరోగా లేదా సమాంతర హీరో పాత్రల్లో వైవిధ్యభరితమైన నటనను కనబరిచారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలక్షణ నటన కనబరిచినా,
హీరోగా ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ రాకపోయినా, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రూపాంతరం చెంది సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించారు.చిరంజీవితో స్క్రీన్ షేరింగ్ ఓ ముఖ్య ఘట్టం.
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఆప్తమిత్రత్వం వల్ల చట్టానికి కళ్లులేవు, మంచు పల్లకి , రాజా విక్రమార్క, మరియు ముఖ్యంగా ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి చిత్రాలలో కీలకమైన సహాయక పాత్రలు పోషించి మెప్పించారు.
గుర్తుండిపోయే పాత్రల చుస్తే
‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. అలాగే
ఒక ఊరి కథ (1977), మృణాళ్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ కళాత్మక చిత్రంలో హీరోగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.వెండితెరపై అవకాశాలు తగ్గిన తరుణంలో ఆయన తన నటనను బుల్లితెరకు విస్తరించారు. తెలుగు ఛానళ్లలో ప్రసారమైన పలు ప్రజాదరణ పొందిన ధారావాహికల్లో గిరిజా కళ్యాణం, తండ్రిగా, పెద్ద దిక్కుగా హుందాగా నటించి, అలరించారు.
నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా టాలీవుడ్‌లో మంచి విజయాలు సాధించారు. చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు, దేవాంతకుడు వంటి హిట్ చిత్రాలతో పాటు ఇంటికో రుద్రమ్మ, పెళ్ళినీకు శుభం నాకు వంటి సినిమాలను ఈయన నిర్మించారు. ‘యముడికి మొగుడు’ సినిమాను తమిళంలో తన మిత్రుడు రజనీకాంత్‌తో రీమేక్ కూడా చేశారు. హిట్లర్, సీతారామయ్యగారి మనవరాలు, స్కైలాబ్ (2021) aవంటి విభిన్న సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించి మెప్పించారు.నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలకు కథా సహకారం అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. చిత్ర రంగం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు ఘన నివాళి అర్పించింది.

సహజనటుడు నారాయణరావు
మెగాస్టార్ తో అనుబంధం