Skip to main content

Telugu News Power

నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సమీక్షి. యాత్రలో 41మంది,7గల్లంతు.

నేపాల్ వరదల్లో ఈదుకుంటూ భారత్ కు చేరిన 5 ఏనుగులు
శిధిలాల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడుతున్న రక్షక దళాలు

అమరావతి: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్‌లో, తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండూలో సురక్షితంగా ఉన్నారని తెలిపారు. చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరుకు చెందిన ఏడుగురు గల్లంతు అయ్యారని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖాట్మండూ, చైనాల్లోని ఎంబసీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. రహదారి, విమాన మార్గాలు ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షిత తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు.

భారత సహాయం తీసుకు వెళుతున్న విమానం

భారత సహాయం
నేపాల్ వరద బాధితుల కోసం భారతదేశ నుంచి ఇప్పటికే రెండు విమానాల్లో సహాయ సామాగ్రి, మందులు నిత్యవసరాలు తరలించారు.

చైనా అక్రమ నిర్మాణాల వల్ల ఈ విపత్తు సంభవించిందా?
చైనా తన దురాక్రమనలో భాగంగా నేపాల్ దగ్గరలో గ్రామాలు నిర్మిస్తూ పోతుంది. అతి సున్నితమైన ఈ ప్రాంతంలో ఈ నిర్మాణాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఇందువల్ల ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయని చెబుతున్నారు. వరదలు సంభవించిన మధ్య నేపాల్లో గురువారం కూడా సహాయక చర్యలు నిరంతరంగా సాగుతున్నాయి. వరదల్లో చిక్కుపోయిన, నాతో ఉన్న వారిని రక్షణ బృందాలు హెలికాప్టర్ల ద్వారా చేరుకుని రక్షిస్తున్నారు.
ముంచు తుఫాను ( ఆవలాంచ్) గా చెబుతున్న ఈ ప్రమాదం వల్ల లయ పర్వత ప్రాంతంలో నివసించే వన్యప్రాణులు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో 5 ఏనుగులు నేపాల్ నుంచి ఈదుకుంటూ వచ్చి భారతదేశాన్ని సురక్షితంగా చేరుకున్నాయి.

నదిలో 36 గంటలు గా కొట్టుకుపోతున్న భార్య మంచు శకలాలు