యలమంచిలి: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పశ్చిమగోదావరి జిల్లా చించినాడ- అంబేద్కర్ కోనసీమ జిల్లా దిండి మధ్య 216 ఉన్న జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై గురువారం మరో ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది.
మూడేళ్ల పసిబిడ్డ ను యాక్టీవా బండిపై వదిలి దంపతులు గోదావరి నదిలో దూకి గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గల్లంతైన వారిని దొడ్డా సాయి (29), శిరీష (28)గా గుర్తించారు. మీరు వేల్పూరుకు చెందినవారుగా తెలిసింది.
ఘటనపై పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృత్యు మార్గంగా మారిన చించినాడ వంతెన.
గోదావరి నదిపై చించినాడా తిండి మధ్య నిర్మించిన వంతెన మృత్యు మార్గంగా మారింది. ఇప్పటికే ఎక్కడెక్కడ వుంచో వచ్చి అందరూ ఈ నదిలో కలిసిపోయారు. ఎన్నో ఏళ్లగా ఈ దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇసుమంత కూడా జాగ్రత్త చర్యలు ఇప్పటివరకు పట్టలేదు. ఈ కష్టం వచ్చినా. విచక్షణ కోల్పోయి తక్షణమే మృత్యు కౌగిలికి చేరిపోవాలనే క్షణికావేశంలో ఎందరో నిండు ప్రాణాలు గోదావరి ప్రవాహంలో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం మిగులుతోంది.
ఈ వరుస విషాదాలను చూస్తూ ఇంకా ఉపేక్షించడం సరికాదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
రక్షణ ఇనుప మెష్ / ఎత్తైన రైలింగ్, బ్రిడ్జికి ఇరువైపులా మనుషులు దూకడానికి వీలులేకుండా వెంటనే ఎత్తైన ఐరన్ ఫెన్సింగ్ (సేఫ్టీ మెష్) ఏర్పాటు చేయాలి.
సీసీటీవీ కెమెరాల నిఘా,బ్రిడ్జి పొడవునా హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలు అమర్చి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించాలి.
పెట్రోలింగ్, సెక్యూరిటీ: వంతెనపై అనుమానాస్పదంగా తిరిగే వారిని గమనించేందుకు నిరంతర పోలీస్ పర్యవేక్షణ లేదా ప్రత్యేక గార్డులను నియమించాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు.
హెల్ప్‌లైన్ బోర్డులు, ఆత్మహత్య నివారణ కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ నంబర్ల బోర్డులను బ్రిడ్జిపై ప్రదర్శించాలని .
చిన్న చిన్న రక్షణ చర్యలతో ఎన్నో నిండు ప్రాణాలను కాపాడవచ్చు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ ప్రమాదకర పరిస్థితిని అరికట్టాలని కోరుతున్నారు .
జీవితంలో ఎలాంటి కష్టమైనా పరిష్కారం ఉంటుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ముద్దు నిద్రలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు ఆవేదన, ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు.