Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలు పరిశీలించిన ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పెందుర్తి.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న పెందుర్తి

నరసాపురం: ఆగస్టు, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంగళవారం నరసాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించి వివిధ ప్రదేశాలను సీఎం ప్రోగ్రాం కమిటీ పెందుర్తి వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం కు స్వాగతం పలికే హెలిపాడ్, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రదేశాలను పెందుర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పెందుర్తి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, నీ వర్గ పరిశీలకులు శేషు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీ శ్రీమన్నారాయణ, వాటాడి కొప్పాడి రవీంద్రనాథ్, పాల రాంబాబు, గుబ్బల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.