Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాయకర్ పిలుపు.

సీఎం సభకు క్షేత్రస్థాయి ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నాయకర్

నర్సాపురం: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నేడు జరిపే పర్యటనకు సర్వం సన్నద్ధం చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, సభా ప్రాంగణం, విందు ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఏపీఐఐసీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన
రామరాజుపాల్గొన్నారు.
అధికారులతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ,
ఈ పర్యటనను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం
చేసే దిశగా సర్వం సిద్ధం చేశామని నాయకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ పర్యటనను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు .