పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అదేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (అటానమస్) కళాశాలలో వ్యాయామ,ఎన్.సి.సి (ఎన్ సీసీ ) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యం హాజరై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్య రహిత సమాజం కోసం విద్యార్థి దశ నుంచే పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దుర్గారావు మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి కేడెట్లు, వ్యాయామ విభాగ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కళాశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు.
శ్రీ అదేపల్లి కళాశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు.
మొక్కలు నాటుతున్న దృశ్యం