
పాలకొల్లు: సెప్టెంబర్,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికాలోని ప్రగతిశీల తెలుగు సంఘం (ఏ పి టీ ఏ) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు కు ప్రత్యేక ఆహ్వానం శుక్రవారం అందజేశారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రావూరి పవన్ సుభాష్ మంత్రిని కలిసి, తమ సంఘ తరపున, చార్లెట్ నగరంలో జరుగుతున్న 18వ వార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, ప్రభాస్ ఆంధ్ర వ్యాపారవేత్త పవన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అందరికీ వివరించారు.