పాలకొల్లు:సెప్టెంబర్,24
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రాధిక నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బొప్పన రాఘవయ్య (82), అనారోగ్య కారణంగా గురువారం విజయవాడలో కన్నుమూసారు. వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎందరో పేద ప్రజల బిడ్డలను కాపాడిన ప్రాణదాతగా, దిక్కు లేని వారికీ ఈ వైద్యుడే నారాయణుడు గా మొక్కులందుకున్నారంటే అతిశయోక్తి కాదు. భార్యభర్తలు ఇద్దరు ప్రభుత్వం ఉద్యోగులు అయినా, వీరి దగ్గరకే తమ బిడ్డను తీసుకువచ్చి బ్రతికించుకొన్నారంటే వారి హస్తవాసి ఎంతటి మహత్తు కాలేదో కదా! ఆ బిడ్డ బ్రతకదని పేరుమోసిన డాక్టర్లు ఆశలు వదులుకోమన్నప్పుడు,డాక్టర్ రాఘవయ్య కేవలం చెక్కబల్లపై బిడ్డను పరుండబెట్టి ప్రాణదానం చేసిన అద్భుతం వైద్య శాస్త్ర పుటలకు ఎక్కని ఎన్నో ఉదాహరణలు. వైద్యులు గా ప్రమాణం చేసినట్టే, వీరు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, భక్తునికి, భగవంతునికి ఉన్నట్లే, రోగికి, వైద్యునికి ఉన్న అనుబంధం. మిగిలిన అన్నిటికి అతీతమైనవి. వీరి ఫీజు కేవలం ఒకే ఒక్క రూపాయి మాత్రమే. ఆ తరువాత చాలా కాలానికి రెండు రూపాయలు అయ్యింది. ఎవరి నుంచి పూచికపుల్ల కూడా ఆశించని మహోన్నత వ్యక్తిత్వం. డాక్టర్ గారికి స్కూటర్ స్టేపిన్ కు కవర్ ఉండేది కాదు. ఓసారి ఏలూరు నుంచి ఆ కవర్ పట్టుకొస్తే, నా కెందుకయ్యా బాబు అన్నారు. రాధికా మెడికల్స్ వారి ద్వారా నాకు కొంచెం చనువు ఉండేది. ఏ టైం లో వెళ్ళినా మా పిల్లలకు వారి అమృత హస్తలతో వైద్యం అందించేవారు. వైద్యవృత్తిని సేవా భావంతో కాకుండా, వ్యాపారం చేసి ఉంటే సగం పాలకొల్లు రఘవయ్య గారి దస్తావేజుల్లో ఉండేది. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ మహనీయునికి కృతజ్ఞతాపూర్వక నివాళి అర్పించకుండా ఉండలేరు. వీరి పెద్ద కుమార్తె రాధిక విజయవాడలో వైద్యురాలు, చిన్న కుమార్తె అమెరికా లో ఉంటున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యరిత్యా పెద్ద కుమార్తె తన దగ్గరే ఉంచికొని సేవలు అందిస్తున్నట్టు సన్నిహితులు ద్వారా తెలిసింది.
డాక్టర్ రాఘూవయ్య మృతితో ఉభయ గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలుమూకొన్నాయి. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
పేదల డాక్టర్, పసిపిల్లల ప్రాణదాత రాఘవయ్య ఇకలేరు.
డాక్టర్ బొప్పన రాఘవయ్య