పాలకొల్లు: అక్టోబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవుళ్ళ పెళ్ళికి దేవతలు దిగి వస్తారంటారు. అది ఎవరు చూసి ఉండరు కానీ, ఉపాధి హామీ శ్రామికుల జంటకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు అన్ని తానై షష్టిపూర్తి ఉత్సవం స్వయంగా జరిపించారు. స్థానిక లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. సందర్భంగా, గోడి రామారావు, సత్యవతి దంపతులకు శాస్త్రోక్తంగా షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా, వారికి నూతన వస్త్రాలు బహుకరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్రావు షష్టిపూర్తి జంటకు నగదు బహుకరించారు. భారీ సంఖ్యలో హాజరైన శ్రామికులు మహిళలు ఈ సంఘటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉపాధి శ్రామికులకు వివిధ పోటీలు నిర్వహించి, లక్కీ డిప్ ద్వారా చీరలు బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ఉపాధి శ్రామికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యంతం ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
అనంతరం, శ్రామికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో, ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, ఎంపీడీవో,
ఉమామహేశ్వరరావు, ఎంఈఓ గుమ్మల వీరాస్వామి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, సత్యనారాయణ రాజు, కామిశెట్టి అయ్యప్ప నాయుడు, ఇంటి శ్రీరాముడు, పాముల రజిని కుమార్, నెక్కంటి ఆదినారాయణ, దుర్గారావు, అందే కోటి వీరభద్ర రావు, బిఎస్ఎన్ఎల్ రాజు, కూనప రెడ్డి బాబు, ఆకుల బ్రహ్మాజీ, నల్లమోతు సత్య ప్రసాద్, ఆదూరు శ్రీనివాసరావు, సాగ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
మంత్రి చేతుల మీదుగా షష్టిపూర్తి. ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ సమ్మేళనం లో ఆవిష్కృతమైన అరుదైన ఘట్టం.