Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి కళాశాలలో ప్రపంచ జంతు దినోత్సవం.

ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ మాణిక్యం

పాలకొల్లు: అక్టోబర్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ జంతు దినోత్సవాన్ని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్నమాణిక్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతు సామ్రాజ్యంలో ఉన్న వివిధ రకాల జీవుల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ ఆవశ్యకత గురించి వివరించారు. జీవవైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.జువాలజీ విభాగాధిపతి డా. రామకృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ జంతు దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు జంతుశాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడంతో పాటు, జంతువుల పట్ల కరుణ, బాధ్యతా భావాలను అలవరచుకుని వాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.జువాలజీ అధ్యాపకురాలు జీ. షమీమ్ మాట్లాడుతూ, ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలైన అడవుల నరికివేత, పర్యావరణ కాలుష్యం, అక్రమ వేట, వాతావరణ మార్పులు, మానవ–వన్యప్రాణి సంఘర్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల ఆవాసాలను పరిరక్షించడం,
ఈ సందర్భంగా విద్యార్థులకు జంతు సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కలిగించే విధంగా విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ ప్రశ్నలను అడిగి విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపల్ టీ.కృష్ణ,డాక్టర్ , బి వెంకటస్వామి, జి సుమలత, పి శ్రీనివాసరావు, డి, హెప్సిబా, జి.వేణుమాధరి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.