పాలకొల్లు: అక్టోబర్,9( తెలుగు న్యూస్ పవర్. కామ్)మండలంలోని తిల్లపూడి గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పంచాయితీ అధికారులు శుక్రవారం సందర్శించారు. మండలంలో ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులకు, హరిత రాయబారులకు ఈ పులికరించే సందర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయటానికి నిర్మించిన కుండీలలో తడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారీ విధానం గురించి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎ ఎన్ .ఎన్. ఉమామహేశ్వరరావు, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి, టీ. మూర్తిబాబు, మాజీ సర్పంచ్ నడపన శ్రీనివాసరావు,టీడీపీ పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ కామిశెట్టి అయ్యప్ప స్వామి నాయుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నీలం తాతాజీ,ఈవన సతీష్, స్థానిక మండల పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
వ్యర్ధాల నుంచి సంపద తయారీ పై శిక్షణ.
వ్యర్ధాల నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద శిక్షణలో పాల్గొన్న పంచాయితీ అధికారులు