Skip to main content

Telugu News Power

ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావును ఘన సత్కరించిన ఛాంబర్స్ కళాశాల యాజమాన్యం.

ప్రిన్సిపల్ డాక్టర్ దిరిశాలను సత్కరిస్తున్న దృశ్యం

పాలకొల్లు: అక్టోబర్,8( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక ఛాంబర్స్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావును అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఈనెల 7న ఛాంబర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యం, పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, మాట్లాడుతూ, డాక్టర్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఛాంబర్స్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, నైతిక విలువలతో కూడిన విద్యాబోధన, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పనకు, విద్యాసంబంధ విషయాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సహాయపడుతూ, ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసానికి ఒక మార్గ దర్శకుడిగా ఉంటూ, మరో ప్రక్క కాలానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్స్, కొత్త కోర్సులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యానికి ఒక దార్శినికుడిగా, అంకుటిత దీక్షతో పనిచేస్తున్నారని , ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున డాక్టర్ డి వెంకటేశ్వరరావును సన్మానించుకోవడం కళాశాల అందరి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం గా భావిస్తున్నామన్నారు.
కళాశాల సెక్రటరీ శ్రీ కె.వి సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ లో ఉన్న 32 వర్తక సంఘాలవారు ఛాంబర్స్ కళాశాల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు పూలమాలలతో సాలువాలతో ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించినారు. పలువురు ఉపాధ్యాయులు,కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు సేవలను సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమానికి కళాశాల అడిషనల్ చైర్మన్ టి.కృష్ణమూర్తి గారు, కళాశాల ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, కళాశాల అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి , నందుల సీతారామారావు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మామిడి బాబు, కటారి నాగేంద్ర కుమార్, విశ్వనాథ రాజు, రంగరాజు, వినుకొండ రంగారావు , కొమ్ముల మురళి గారు, చినమిల్లి శ్రీనివాసు, అడబాల రమణ, సత్యనారాయణ రాజు, అధ్యాపకులు రవికుమార్, రాధా మాధవి, రాంబాబు, రాము,జానకి రామయ్య, విజయలక్ష్మి, మీనా, లింగరాజు,శాంతి సురేఖ, విద్యార్థులు పాల్గొన్నారు.