
పాలకొల్లు: అక్టోబర్, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) మనిషి ఎదుగుదలకు శక్తినిచ్చేది చదువు మాత్రమేనని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేట, అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువు వల్లే తాను అధ్యాపకుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎదగలిగాలని తెలిపారు. చదువు వల్ల పేద బిడ్డలు కూడా నేడు అత్యున్నత స్థానాలు అధిరోహిస్తున్నారని మంత్రి వివరించారు. తల్లిదండ్రులు తమ సంతానాన్ని చక్కగా చదివించాలని మంత్రి పిలుపునిచ్చారు. నాటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటం ప్రభుత్వం వచ్చాక, అభివృద్ధి పనులను చేపట్టి కొనసాగిస్తున్నామన్నారు. కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా తీరికలేని పరిస్థితుల్లో కూడా నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వెల్లడించారు. ఈ సందర్భంగా సంధ్యా మెరైన్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం మంచి ప్రయోజనం ఉన్న కార్యక్రమమని, ఇందుకు రూపకల్పన చేసిన మెంబల రామాలయం అభినందించారు. భవిష్యత్తులో కూడా తమ సంస్థ తరఫు న సహకరిస్తామని హామీ ఇచ్చారు. పూలపల్లి, సంధ్యా మరైన్స్ సమస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సి ఎస్ ఆర్) నిధులతో 198 మందికి ఉచిత సైకిళ్ళు అందజేశారు. సంధ్య మెరైన్స్ డైరెక్టర్, అరుణ్ కుమార్ ను మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మండల విద్యాశాఖ అధికారి గుమ్మళ్ళ వీరస్వామి, హెచ్ఎం గోపి కృష్ణ, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయ భాస్కర్, కర్నేని గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, మీసాల రామచంద్రరావు, తులా రామలింగేశ్వరరావు, ఉన్నమట్ల కపర్తి, ముప్పిరి సత్యనారాయణ, కొల్లు పవన్, రియా, పొట్నూరి రమేష్, కొల్లి కొండ ప్రసాద్, పాలంకి మహేష్, మురళి, గంధం సుబ్బారావు, పొట్నూరి శ్రీనివాస్, మహమ్మద్ జానీ, శ్రీరామచంద్రమూర్తి, జయ ప్రకాష్, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సభలో పాల్గొన్నారు.