Skip to main content

Telugu News Power

జనసేన పార్టీలోకి శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి.

దిలీప్ ను ఆహ్వానిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి: అక్టోబర్,14
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాను కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆయన, జనసేన పార్టీతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసిన అనంతరం వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. మళ్లీ రాజకీయంగా చురుగ్గా జనసేన పార్టీలోనే చేరారు. ఈ సందర్భంగా దిలీప్ చక్రవర్తి తాను రచించిన “లైఫ్ హక్స్” పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. అనంతరం దిలీప్ చక్రవర్తితో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.