Skip to main content

Telugu News Power

జనసేనకు వంగవీటి. ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్.

వంగవీటిని జనసేన పార్టీలోకి ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి: అక్టోబర్, 14
(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా, ప్రజాభిమానం ఉన్న వంగవీటి మోహనరంగారావు, రంగా వారసులు వంగవీటి రాధాకృష్ణ బుధవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కొనువా కప్పి పార్టీలోకి ఆధారంగా వానించారు. ఎంతో కాలంగా ఈ ఘట్టం చోటు చేసుకుంటున్నాను అభిమానులు ఎదురు చూశారు. ఎట్టకేలకు అది నిజమయింది. రంగా అభిమానులకు జనసేన పార్టీ తీపి కవురు అందించింది.వంగవీటి రాధాకృష్ణ, 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో 2014లో చేరారు. వైసీపీ ప్రభంజనం లో విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయమని జగన్ కోరినప్పటికీ, అసెంబ్లీ స్థానం కోసం పట్టుపట్టారు. రాజకీయ సమీకరణాలు అంచనా వేయటంలో విఫలమైన కారణంగా, అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ వారికి సరియైన గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం జనసేన పార్టీలో చేరారు. కూటమి పొత్తు ధర్మం ప్రకారం విజయవాడ మేయరు స్థానం రాధాకృష్ణ కుటుంబానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.