భీమవరం: అక్టోబర్,15 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ అమ్మవారు గురువారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమం వైభవం గా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మల్లువలస లక్ష్మి నిర్మల, యండ సత్యవతి, గొంతెన రమణ,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ మావుళ్ళమ్మకు ఊంజల్ సేవ.
శ్రీ మావుళ్ళమ్మకు ఊంజల్ సేవ నిర్వహిస్తున్న దృశ్యం