Telugu News Power

నేడే ముక్కోటి ఏకాదశి

యలమంచిలి: డిసెంబర్, 29 (తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ధనుర్మాసం (మార్గశిర మాసం) లో వచ్చే ఏకాదశి. ముక్కోటి అనే పదానికి అర్థం ముక్కోటి అంటే మూడు కోట్లు దేవతలు. ఈ రోజున మూడు కోట్లు దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణ విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని నమ్మకం. భక్తులు…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు

తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది….

Read More

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది. స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద…

Read More

నేడే కల్యాణోత్సవాల ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,19( తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, 33వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గణపతి హోమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణోత్సవ విగ్రహాలతో స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం అందజేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ…

Read More

యలమంచిలి శిఖరాలు చేరిక

యలమంచిలి: డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న యలమంచిలి గ్రామ దేవత,శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పుణఃనిర్మాణం చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. నూతన దేవాలయ శిఖరం పై ఉంచవలసిన పంచలోహ శిఖరాలు శుక్రవారం వరకు యలమంచిలి చేరుకున్నాయి. వీటి బరువు 85 కేజీల 385 గ్రాములు. వీటిని తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి స్థానిక విష్ణాలయంలో…

Read More

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం సిద్ధం

సఖినేటిపల్లి: డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవ ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేవస్థానంలో ముందుగా పూజలు నిర్వహించి, మేళతాళాలతో రథం షెడ్డు కు వెళ్లి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రథాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇకనుండి రథోత్సవం వరకు రథాన్న శుభ్రం చేయటం, అలంకరించడం వంటి పనులు చేపడుతారు. ఊరేగింపుకు రథాన్న సంసిద్ధం చేస్తా మనీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్…

Read More