Telugu News Power

పాలకొల్లు టిడిపికి పలు జిల్లా పదవులు.

భీమవరం: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ, పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం, భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఇన్ లో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎస్ ఎస్ ఐ డి సి, చైర్మన్,మంతెన రామరాజు జిల్లా అధ్యక్షులుగా,వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి పాలకొల్లుకు నియోజకవర్గానికి చెందిన పలువురికి జిల్లా కమిటీలు స్థానం కల్పించారు. దిగమర్రు సాగునీటి సంఘం అధ్యక్షులు, ఎలమంచిలి మండల, టిడిపి సీనియర్ నాయకులు మాతా రత్నం…

Read More

పాలమూరు రక్షిత మంచినీటి పథకం ప్రారంభించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం పాలమూరు గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, ఏడదిన్నరలోనే సుమారు 61 లక్షల వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నీటి స్వచ్ఛత గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. దగ్గులూరు లో50.40 లక్షలు, గవరపేట 40.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీరు…

Read More

మద్దాలకు అవార్డు

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ కమిషనర్ అవార్డుకు ఎంపిక అయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజున, కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. స్థానిక సర్కిల్ పరిధిలోగల, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువత మాదకద్రవ్యా బారిన పడకుండా, వీరు నిర్వహిస్తున్న, అనేక అవగాహన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరు వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా. పలువురు అభినందనలు తెలియజేశారు.

Read More

గ్రామం మనకేమిచ్చిందని కాదు, గ్రామానికి ఏమిచ్చామని ఆలోచించాలి. – గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్ భగవాన్ రాజు.

పాలకొల్లు: జనవరి, 24, (తెలుగు న్యూస్ పవర్) గ్రామం మనకేమిచ్చిందని కాకుండా, గ్రామానికి మనమేమి ఇచ్చామని, ఆలోచించాలని, పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, ఏఎంసి,మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. పచ్చదనం-పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా,స్థానిక ఆఖరి మజిలీ రోడ్డు మార్గాన్ని,స్మశానవాటికను, గ్రామ ప్రజలు, పంచాయతీ అధికారులతో కలిసి శనివారం శుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, గాంధీ మెగా ఫౌండేషన్ గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. స్థానిక…

Read More

ప్రపంచ ప్రఖ్యాత ఎముకల డాక్టర్ “సుంకర” కు ప్రముఖుల నివాళి.

భీమవరం: జనవరి,24(తెలుగు న్యూస్ పవర్) ,ప్రపంచ ప్రఖ్యాత ఎముకల వైద్యులు, సుంకర ఆదినారాయణ రావు, విశాఖపట్నంలో ఇటీవలమరణించారు. ఈ సందర్భంగా,ఆయన స్వస్థలం భీమవరం లో ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. పోలియో రహిత, భారతదేశం, కలల సాకారం కోసం సుంకర అవిశ్రాంత కృషి చేశారని, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కొనియాడారు. పోలియో బాధితులకు, కొత్త జీవితం ఇవ్వడం కోసం, లక్షలాది శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరి సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి…

Read More

అంతర్వేదికి చించినాడ వంతెన సిద్ధం చేయాలి -కలెక్టర్ ఆదేశాలు

అమలాపురం: జనవరి, 24(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా, చించినాడ వంతెన పై రాకపోకలు పునరుద్ధరించాలని, కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. అంతర్వేది ఉత్సవ ఏర్పాట్లు గురించి, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేది ఉత్సవాలకు వచ్చే వారికి వీలుగా, ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జి పై బస్సుల రాకపోకలు…

Read More

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీఈఓ హామీ

ఏలూరు: జనవరి, 23(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి, ఎం శ్రీహరి, ఉపాధ్యాయ సమస్యలపై సానుకూలంగా స్పందించినట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. పిఎఫ్ రుణాల మంజూరు, సి ఎఫ్ ఎం ఎస్ కు వెంటనే పంపడం, మిస్సింగ్ క్రెడిట్, బ్యాలెన్స్ షీట్ ల విడుదల అంశాలపై శుక్రవారం యుటిఎఫ్ జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేశారు. దీనిపై సీఈఓ, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ…

Read More

పుష్కరాల ఏర్పాట్లపై తొలి సమావేశం.

అమరావతి; జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పుష్కరాల ఏర్పాట్లపై అత్యున్నత స్థాయి తొలి సమావేశం శుక్రవారం జరిగింది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 తేదీ వరకు 12 రోజులపాటు పుష్కరాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గోదావరి నది ప్రవహించే, పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఈ ఆరు జిల్లాల్లో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, నిమ్మల రామానాయుడు, ఆనం…

Read More

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) రోడ్డు భద్రత పై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండటం, బాధ్యతగా భావించాలని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సూచించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో, ట్రాఫిక్ వారోత్సవాలు భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, కే రజని కుమార్, మాట్లాడుతూ, హెల్మెట్, సీట్ బెల్ట్, ధరించడం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం మంచిదని, సూచించారు. సబ్ ఇన్స్పెక్టర్, జి.ప్రసాద్, రహదారి ప్రమాదాల…

Read More

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, 43వ పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి పాఠశాలలో మాత్రమే ఉండే, మెగా పేరెంట్స్, టీచర్స్ డే ఏర్పాటుచేసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య జవాబు దారి తనం తీసుకువచ్చారన్నారు. ఐటి కంపెనీలు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చిన్న…

Read More