Skip to main content

Telugu News Power

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.

అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…

Read More

రాష్ట్ర పండుగగా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.

అమరావతి: జులై 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్ని కుల క్షత్రియులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పూర్ణమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చిలకలపూడి పాపారావు స్థానిక తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చక్కని కురుక్షత్రియ చిరకాల మంచ నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, సహకరించిన…

Read More

భోగాపురం విమానాశ్రయంలో థింసా నృత్యానికి ప్రపంచ రికార్డు.

విశాఖపట్నంభోగాపురం:జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో 13,500 మంది గిరిజన మహిళలు, కళాకారులు ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన ధింసా నృత్యాన్ని ఒకే వేదికపై భారీ స్థాయిలో ప్రదర్శించడం…

Read More

సార్వా కు సాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) సార్వా లో రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక నీటిపారుదల సలహా మండలి సమావేశంలో…

Read More

జిల్లాలో కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులు, మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా వచ్చిన…

Read More

నేడు యలమంచిలిలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

యలమంచిలి:జూలై,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి శుక్రవారం మండలంలో పర్యటిస్తారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ గురువారం తెలిపారు. ఈ పర్యటనలో మండలంలో గల 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, యూపీ పాఠశాలలలో లో ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సంఘ బాధ్యులు, కార్యకర్తలు ఎక్కువమంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలో…

Read More

దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.

పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు…

Read More

పదవీకాలం ముగుస్తున్న గౌరవ వేతనం లేదు. -మండల పరిషత్ సభ్యుల ఆవేదన.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మరో నెలలో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ గత మూడేళ్లుగా మండల పరిషత్ సభ్యులకు చెల్లించవలసిన గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలయోగి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ సమావేశం జరిగింది. అధ్యక్షురాలు వివిధ శాఖల పని తీరు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్…

Read More

వికసిత్ పశ్చిమగోదావరి లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర పథకాలపై సమీక్ష.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లాను విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, లంకా దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా, ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర పథకాల అమలు,…

Read More

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్,…

Read More