Skip to main content

Telugu News Power

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా, చదరంగం పోటీలు.

చదరంగం పోటీలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

పాలకొల్లు:అక్టోబర్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్)
వయోవృద్ధులు అంటే కేవలం వయస్సు పెరిగి ఏమీ చేయలేని నిస్సహాయకులు కాదని, సుమారు 40 ఏళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తమ శక్తియుక్తులను ధారపోసిన మహనీయులని, వయోజన సంక్షేమ సంఘ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకట రత్నం పేర్కొన్నారు. జీవితానుభవంతో కుటుంబానికి, సమాజానికి ఎంతో శ్రమ, త్యాగం చేసి అభివృద్ధికి బాటలు వేసిన విజయ సారథులన్నారు. ప్రపంచ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా, స్థానిక పెన్షనర్స్ భవనంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం సీనియర్ సిటిజెన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదరంగం
పోటీలునిర్వహించారు.
ఈ పోటీలలో 16 మంది వయో వృద్దులు పాల్గొన్నారు.
వర్ధినీడి సూర్య వెంకట రత్నాజీ రావు (ప్రథమ), మానెం ధన గణేష్ (ద్వితీయ), కలిదిండి వెంకటపతి వర్మ (తృతీయ), ర్యాలీ విష్ణు మూర్తి (ప్రోత్సాహక) బహుమతులు గెలుసుకున్నారు.
సంఘ ప్రధాన కార్యదర్శి జి ఎస్ ఎన్ మూర్తి, కోశాధికారి
డా. పేరిచర్ల సత్య ప్రతాప్ రాజుల పర్యవేక్షణ లో, దివి సూర్యనారాయణ మాస్టారు న్యాయ నిర్ణేతగా వ్యవహారించారు.
ఈసందర్భంగా,సంఘానికి గొప్ప
సేవ చేస్తున్న వయో వృద్ధులు పెనుగొండ సూర్యనారాయణ, గోపరాజు గోపిలను
సంఘ గౌరవ అధ్యక్షులు వంగా నరసింహరావు, కొండ్రేడ్డి సూర్యనారాయణ లు సన్మానించారు.
ఈ కార్యక్రమం లో
డా. సంగీనీడి వెంకట రంగారావు,
శృంగారపు కృష్ణ ప్రసాద్ మాస్టారు,
గెద్దాడ ఫణింద్రుడు,
యర్రా అజయ్ కుమార్,
యర్రమిల్లి నరసింహ రావు,
కంచి వి వి సత్యనారాయణ,
బోనం మునసబు, ముచ్చర్ల రామ కృష్ణ ప్రసాద్, పేరిచర్ల రామరాజు, ఈదర నాగేశ్వరరావు,
పేరిచర్ల వెంకట సత్య మార్తండ వర్మ,ఏలూరి శ్రీనివాసరావు,
మండెల పెద్ద, వాకలపూడి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఆధ్యంతం ఉత్సాహకరంగా సాగింది.