Skip to main content

Telugu News Power

అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి దుర్గేష్.

అఖండ గోదావరి పనులు పరిశీలిస్తున్న మంత్రి కందుల

నిడదవోలు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నిడదవోలు నియోజకవర్గం శెట్టిపేటలో కొనసాగుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మార్చి కందుల దుర్గేష్ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, డిజైన్ ప్రకారం నిర్మాణాల పురోగతిని స్వయంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శెట్టిపేట గోదావరి కెనాల్ తీరంలో పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపేలా బోటింగ్ పాయింట్, వే-సైడ్ రెస్టారెంట్, అధునాతన ప్లే జోన్, చినకాశీరేవు ఘాట్ అభివృద్ధి వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు .
ఈ ఏడాది డిసెంబర్ నాటికి శెట్టిపేట ప్రాజెక్టు పనులను పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసి ముందుకు నడిపిస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లోని గోదావరి తీరాలు భక్తులకు సకల సౌకర్యాలతో, పర్యాటకులకు కనువిందు చేసేలా మరింత వైభవంగా ముస్తాబు కానున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలియజేసారు.