Skip to main content

Telugu News Power

శ్రీ మావులమ్మకు రూ. 2.20 లక్షల వెండి వస్తువుల సమర్పణ.

భక్తులను సత్కరిస్తున్న ఆలయ కమిటీ, అర్చకులు.

భీమవరం: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వినియోగించు వెండి పళ్లెం, ఉద్దరిణి భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. గొల్లవానితిప్ప కి చెందిన కొప్పర్తి బేబీ, శ్రీ ఫణి అనీషా రూ 2.20 లక్షల విలువ గల 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె ఉద్ధరిణి సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో సత్కరించగా, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందచేసారు.