పాలకొల్లు,సెప్టెంబర్,10(తెలగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో, గురువారం కళాశాల సీపీడీసీ సభ్యులు, కళాశాల వ్యవస్థాపకులు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి మనుమడు, అద్దేపల్లి గంగరాజు సత్రం వ్యవస్థాపక చైర్మన్, అద్దేపల్లి మోహన్ దాస్(75 మందికి), కళాశాల పూర్వ విద్యార్థి, విజయ డయోగ్నస్టిక్ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ (25 మందికి) సహకారంతో కళాశాల బాలికలకు ఉచితంగా యూనిఫాంలను పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం అధ్యక్షతన బాలికలకు ఉచిత యూనిఫాంల పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, ప్రోత్సాహం అందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చునన్నారు. ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని, కళాశాల పూర్వ విద్యార్థులు, దాతలు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సహాయం అందిస్తున్న దాతలకు కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అద్దేపల్లి మోహన్ దాస్ మాట్లాడుతూ, తాను చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇటువంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. బాలికలు విద్యలో ఉన్నతంగా రాణించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
కొమ్ముల మురళీకృష్ణ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థిగా తాను చదువుకున్న కళాశాల విద్యార్థుల కోసం సేవ చేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి, తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె . రత్న మాణిక్యం, సీపీడీసీ సభ్యులు, దాతలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి పి డి సి సభ్యులు డాక్టర్ ఎస్ వి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ,వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ, జెకెసి కోఆర్డినేటర్ కే శామ్యూల్, స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, శ్రీరామ్ నరేంద్ర, శేఖర్, షమీమ్, షణ్ముఖరావు, సునీల్ కుమార్, జీ డి శ్రీనివాస్,పి శ్రీనివాస్ రావు , ఏ వంశీ సుబ్బరాయన్, సిహెచ్ రవికుమార్, కే పార్థసారథి,వి శిరీష తదితర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
అద్దేపల్లి కళాశాలలో 100 మంది బాలికలకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.
దాతలు, అధ్యాపాకులతో ఉచిత దుస్తుల అందుకొన్న విద్యార్థినిలు