పాలకొల్లు:సెప్టెంబర్,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి,డి సి ఏం ఎస్ మాజీ ఛైర్మన్, కౌన్సిల్ , వై సీ పి మాజీ ఫ్లోర్ లీడర్, యడ్ల తాతాజీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.ఈ సందర్బంగా, తాతాజీ స్వగృహం లో గురువారం పలువురు వైసిపి ప్రముఖ నాయకులు పరామర్శించారు. తాతాజీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షులు, ముదునూరి ప్రసాద్ రాజు,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ముదునూరి మురళీకృష్ణం రాజు,
నియోజవర్గం ఇంచార్జ్ గుడాల శ్రీ హరి గోపాలరావు (గోపి),పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల,సిఈసీ సభ్యులు,మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు,సీనియర్ నాయకులు దత్తాత్రేయ వర్మ, పాలకొల్లు జెడ్పీటీసీ నడపన గోవిందరాజులునాయుడు,
యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి,రవికుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైసీపీ కార్యదర్శి యడ్ల తాతాజీని పరామర్శించిన రాష్ట్ర పార్టీ నాయకుల.
యడ్ల తాతాజీ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న వై సి పి నాయకులు.