పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలోని 1 నుంచి 15 వార్డుల్లో రూ.3.08 కోట్ల తో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ పై సుడిగాలి పర్యటన చేశారు. గత వైసిపి ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. మంచినీటి సరఫరా, ఆసుపత్రి సౌకర్యం, టిడ్కో ఇళ్ళు నిర్మాణం వంటి పనులు పునఃప్రారంభించి పూర్తి చేస్తున్నామన్నారు. వచ్ఛే జూన్ నాటికి డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం చెత్త పై పన్నులు వేసిన చెత్త పాలన ప్రజలు మర్చిపోరన్నారు. వివిధ వార్డుల్లో సిసి రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్ ట్టుల నిర్మాణానికి మంత్రి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో, కర్నేని గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, మీసాల రామచంద్ర రావు, ఉన్నమట్ల కపర్తి, పెండ్యాల భవాని, చీరా సత్తిబాబు, పీతల శ్రీనివాస్, జగ్గరోతు రాంబాబు, మల్లుల వెంకట్,వట్టం గణేష్, ధనాని సూర్య ప్రకాష్, మల్లంపల్లి ఫకీర్ బాబు, బిట్ట లక్ష్మీనారాయణ, కొల్లు పవన్, తదితర కూటమి నాయకులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు రూ. 3.08 కోట్ల నిధుల మంజూరు. -మంత్రి నిమ్మల శంకుస్థాపనలు
స్థానిక ఏడవ వార్డు వెంకటేశ్వర కాలనీలో శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిర్మల