పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు.
డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వలన లోటు వర్షపాతం ఉంటుందని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దుక్కిలో ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్ ఎరువును ఉపయోగించి కలియ దున్నుకోవడం ద్వారా భూమికి సేంద్రియ ఎరువు లభ్యమవుతుందని వివరించినారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు పాలకొల్లు వారు మాట్లాడుతూ, ఆపైమ్స్ యాప్ ద్వారా మాత్రమే రైతులకు యూరియా, డిఏపి ఎరువులు పంపిణీ జరుగుతుందని వివరించినారు.
ఈ కార్యక్రమంలో ఆచంట పాలకొల్లు పోడూరు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులు రైతు సేవ కేంద్రం ఇన్చార్జులు పాల్గొన్నారు.
రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.
శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారి మురళీకృష్ణ