పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుబ్బల సత్యనారాయణ(57) శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందారు. వీరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందినవారు. ముమ్మిడివరంలో వ్యవసాయశాఖ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరితో కలిసి హైదరాబాదులో ఉన్న తమ కుమార్తె కుటుంబాన్ని చూసి తిరిగి వస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వీరు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో దిగి రాజోలు కు ఆటోలో పయణం అయ్యారు. సత్యనారాయణ ఆటో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నట్టు చెబుతున్నారు. ఆటో పాలకొల్లుకు దగ్గరలో తిరగబడి సత్యనారాయణ అక్కడక్కడ మరణించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంకా ఈ ఆటోలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఆటో బోల్తా, ఉద్యోగి మృతి. కుమార్తెను చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు…
మృతుడు గుబ్బల సత్యనారాయణ