Telugu News Power

ఆక్వారంగంపై కేంద్రమంత్రి, అధికారులతో సమీక్ష.

ఆక్వారంగంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్న కేంద్ర మంత్రి వర్మ

భీమవరం:జూలై, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రంగంపై స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపెడ, మత్స శాఖ అధికారులు ఈ సమీక్ష దేశంలో పాల్గొన్నారు .ఆక్వా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎమ్ ఎమ్ ఎస్ వై ) ద్వారా మరింత ఎక్కువ మంది రైతులు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన ఎమ్ పె డా కార్యాలయం, ఆధునిక ల్యాబ్‌ల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఈ సమీక్ష లో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నాను. ఈ సమీక్ష సమావేశంలో ఎం పె డ ఏడీ జి. మెహతా, మత్స్య శాఖ జేడీ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 15న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతుల సమస్యపై ఉద్యమించనున్న దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.