Telugu News Power

చైర్మన్ అవినాష్ సౌజన్యంతో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ.

బిఆర్ఎంఏ బాలికల పాఠశాల వద్ద ఉచిత నోటికి పుస్తకాల పంపిణీ కార్యక్రమం దృశ్యం.

పాలకొల్లు: జూలై, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బీ ఆర్ ఎం వీ బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మన్యం జగ్గమ్మ గారి సత్రం
చైర్మన్ మండాది అవినాష్ సౌజన్యంతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పట్టణ టీడీపీ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా ప్రచార విభాగం కో ఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, పట్టణ బిజెపి అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు కొమ్ముల దినేష్, ఈవో పులగం వేణుగోపాల్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.