Skip to main content

Telugu News Power

ఇస్రో ప్రధాన కార్యాలయంలో అధ్యయన పర్యటనకు ఎంపీ పాక సత్యనారాయణ.

ఇస్రో శాస్త్రవేత్తలతో ఎంపీ పాక

బెంగళూరు:ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అంతరిక్ష భవన్‌ ప్రధాన కార్యాలయంలో డిపార్ట్మెంట్ అఫ్ స్పేస్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ ఎస్ ఎఫ్ సి) ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ సమావేశమయ్యారు. భారత అంతరిక్ష కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.

గగన్‌యాన్ ప్రయోగం, ఆదిత్య-ఎల్ 1 మిషన్ మరియు ఇస్రో భవిష్యత్ అంతరిక్ష మిషన్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలపై ఈ చర్చలు ఎంతో ఆసక్తికరంగా సాగాయ ఎంపీ వివరించారు..