Skip to main content

Telugu News Power

టంగుటూరికి భారతర రత్న ఇవ్వాలి. ఆంధ్ర కేసరి టంగుటూరి 154వ జయంతి కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

ఆంధ్ర కేసరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న బ్రాహ్మణ సంఘం

పాలకొల్లు: ఆగస్టు,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్దా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ, ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం తప్పక వారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా నేను రాష్ట్రానికి చేసిన సేవలు, వారి త్యాగమయ జీవితం, నీ స్వార్థ సేవకుడు టంగుటూరి జీవితం నేటి తరానికి ఆదర్శం అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు