
పాలకొల్లు:ఆగస్టు,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ రద్దు చేయాలి. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 (1) సవరించాలి. సంబంధిత సబ్జెక్టు కు మాత్రమే సిలబస్ ను పరిమితం చేయాలి.
పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలో అర్హత మార్కులను తగ్గించాలి. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో కూడా ఉపాధ్యాయుల డిమాండ్లు పరిగణలోకి తీసుకోనందున యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. డివిజన్ కేంద్రoలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు కే రాజశేఖర్ జిల్లా కార్యదర్శిలు రాజశేఖర్, ఏసుబాబు, రాష్ట్ర కౌన్సిలర్స్ పిల్లి శ్రీనివాస్ కమిటీ మెంబర్ డివి నరసింహారావు, జై దుర్గారావు యలమంచిలి మండలం యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుత్తుందీవి శ్రీనివాసరావు, పంతం రామమూర్తి నాయుడు, టౌన్, రూరల్, పోడూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ త్రి నాధరావు పెద్దిరాజు
రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఎస్ జై ప్రభ సిఐటియు నాయకులు దేవ సుధాకర్ ఈ నిరసన కార్యక్రమాన్నిఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని కోరారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని, తహసీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు.