Skip to main content

Telugu News Power

అంతర్వేది నరసింహస్వామివారి అన్నదాన ప్రసాదానికి కొవ్వూరు వాసి రూ. లక్ష విరాళం.

దాతలు అన్నాత్తుల దంపతులను సత్కరిస్తున్న ఆలయ ప్రతినిధులు

సఖినేటిపల్లి (అంతర్వేది): ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన
అంతర్వేది గ్రామములో స్వయంభూ గా వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయములో నిర్వహించే నిత్యాన్నదానట్రస్ట్ కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వాస్తవ్యులు అన్నాబత్తుల నితిన్, కమల్ చైతన్య దంపతులు రూ. లక్ష విరాళముగా సమర్పించారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది శ్రీ స్వామి వారి చిత్రపటం ప్రసాదములను అందజేసారు.